పుత్తడి కోసం పరుగులు పెట్టొద్దు...జస్ట్ వెయిట్!

03-08-2015 Mon 13:01 | Business
బంగారం ధరలు ఐదేళ్ల కనిష్ఠ స్థాయులకు చేరినప్పటికీ, నూతన కొనుగోళ్లకు ఇది సరైన సమయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధరలు మరింతగా పతనమయ్యే అవకాశాలు ఉన్నందున ఇంకొంత కాలం వేచి చూడాలన్నది వారిస్తున్న సలహా. బంగారం ధరలు ఇంతకన్నా పడిపోదులే అని భావించే సమయం ఇంకా రాలేదన్నది నిపుణుల అంచనా. ఇంటర్నేషనల్ మార్కెట్లో జూలై 22న బంగారం ధర ట్రాయ్ ఔన్సుకు (31.1 గ్రాములు) 1,090 డాలర్లకు పడిపోయింది. ఇది ఐదేళ్ల కనిష్ఠస్థాయి. సెప్టెంబర్ 2011లో ఆల్ టైం రికార్డు ధర 1,900 డాలర్లతో పోలిస్తే ఇది 42 శాతం తక్కువ. ఈ ధర కన్నా ఎక్కువ పతనం నమోదు కాదన్న అంచనాలతో ఆ మరుసటి రోజు భారీగా కొనుగోళ్లు జరగడంతో బంగారం ధర పెరిగింది. అయితే, ఇది తాత్కాలికమే అయింది. జూలై 22తో పోలిస్తే నెలాఖరుకు 8 శాతం వరకూ ధరలు పడిపోయాయి. ప్రస్తుతం 1080 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధరలు 990 డాలర్ల కన్నా దిగువకు రాకపోవచ్చని జియోజిత్ కాంట్రేడ్ డైరెక్టర్ సీపీ కృష్ణన్ అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి 990 డాలర్ల నుంచి 1,040 డాలర్ల మధ్య కొనుగోలు మద్దతు రావచ్చని అన్నారు. గనుల నుంచి ఔన్సు బంగారం వెలికితీయడానికి 1000 డాలర్లు ఖర్చవుతున్నందున అంతకుమించి ధరలు పడిపోకపోవచ్చని వివరించారు. అందువల్ల ఔన్సు బంగారం ధర మరో 40 డాలర్ల వరకూ తగ్గిన తరువాత కొనుగోళ్లు చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం బులియన్ బుల్ ఆపరేటర్లందరూ నష్టాల్లో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరగడం ప్రారంభమైతే 1,130 డాలర్ల నుంచి 1,140 డాలర్ల మధ్య నష్టాలను పూడ్చుకునేందుకు ఈ ట్రేడర్లు యత్నిస్తారని, దాని వల్ల మరోసారి ధరలు దిగివస్తాయని అంచనా. మరోవైపు వెండి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఏప్రిల్ 2011 ఆల్ టైం రికార్డు ధర ఔన్సుకు 48.6 డాలర్లతో పోలిస్తే, ఇప్పుడు 70 శాతం తక్కువ ధరకు వెండి లభిస్తోంది.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more